8 మెట్టు: దేవుడు మన సృష్టికర్త

‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ….’ – యోహాను 3:16 లో బైబిలు మనకు చెబుతుంది.

బైబిలులో దేవుడు తన గురించియు, తనకు మనపట్ల గల ప్రేమను గురించియు ఏమి చెప్పుచున్నారు?

ఆదికాండము 1:1 – బైబిలులోని మొదటివచనము లో  ‘ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను’ అని చెప్పబడింది.

ఆయన సూర్యున్ని, చంద్రున్ని, నక్షత్రములను, సమస్త ప్రపంచములను సృష్టించెను. ఆయన పర్వతములను, నదులను, సెలయేరులను, జలపాతములను సృష్టించెను. ఆయన చెట్లను, పూవులను, మొక్కలను, సమస్త జంతువులను, పక్షులను సృష్టించారు.  భూమిపైనను, సముద్రములలోను జీవము గలిగిన సమస్తమును ఆయన సృష్టించారు.

మనము ఆనందించవలెనని ఆయన సమస్తమును సృష్టించి మనకు అనుగ్రహించారు. సృష్టి యొక్క సౌందర్యము నేను చూచినప్పుడు, మన సృష్టికర్తయైన దేవుని నా హృదయములో నేను ఆరాధించెదను.

మరియు ‘ దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను, పురుషునిగాను వారిని సృజించెను’ అని బైబిలు చెబుతుంది.

మనము శారీరకంగా దేవుని వలె ఉండముగాని ఆయన మన ఆత్మను ఆయన ఆత్మ వలె నిర్మించెను. దేవుని సమస్త సృష్టిలో మనము ప్రత్యేకింపబడినవారము.

మనము ఎంతో ప్రత్యేకమైనవారము. ఇప్పుడు జీవించే కోట్లాది జనులలో గాని, మునుపు జీవించిన వారిలో గాని మీ వలెగాని, నా వలెగాని ఎవరూ ఉండరు.

అది యెంతో  ఆశ్చర్యకరమైన విషయం కదా! మనలో ప్రతి ఒక్కరము దేవునికి ప్రత్యేకమైనవారము.

మనలో ప్రతి ఒక్కరి గురించి, మన పేరుతోసహా దేవునికి తెలియును. యెషయా 43:1 లో “పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు” అని ఆయన చెబుతున్నారు.

ప్రార్ధన: సర్వశక్తిగల దేవా! భూమ్యాకాశాముల సృష్టికర్త! నన్ను సృష్టించినందుకు, నన్ను విశిష్టoగాను, ప్రత్యేకంగాను చేసినందుకు వందనములు. ఆమెన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *