13 మెట్టు: ప్రభువైన యేసు – ఆశ్చర్యకార్యములు చేయు దేవుడు

ప్రభువైన యేసు ముప్పైయేండ్ల వయసులో ఉన్నప్పుడు తన ఇంటిని వదిలి తన పరిచర్యను చేయుటకు బయలుదేరెను. లోకములోని అందరిని రక్షించుటకే ఆయన ఈ లోకమునకు వచ్చెను.మనము ప్రభువును, ఆయన శిష్యులను వెంబడించి, ఆయన చెప్పు మాటలను విని, ఆయన చేయు కార్యములను చుద్దామా?

నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను! మీరు కూడా ఉత్సాహంగా ఉన్నారని నాకు తెలుసు! ఆయన పల్లెల మధ్య తిరుగుచు దేవుని గురించి ఆయన రాజ్యమును గురించి చెప్పుట మనము చూస్తున్నాము. ఆయన అది ఆత్మ సంబంధమైన రాజ్యము అని, భూలోక సంబంధమైన రాజ్యము కాదని ఆయన చెప్పుచున్నారు. ఆయన సర్వజనములపై కనికరము కలిగియున్నారు. ఆయన హృదయము వారిపై కనికరముతో నిండియుంది. ఆయన రోగులను, కుష్టు రోగులను, చెవిటివారిని, గ్రుడ్డివారిని, కుంటివారిని స్వస్థపరచుచున్నారు. దుష్టశక్తులను వెళ్లగొట్టుచున్నారు. ప్రజలు ఆయనయొద్దకు పరుగెత్తి వచ్చుచున్నారు! తన ఏకైక కుమారుడు చనిపోయాడని రోధిస్తున్న ఒక విధవరాలి పట్ల కనికరము కలిగి, యేసు ప్రభువు ఆ చనిపోయిన బాలుని ముట్టి మరల జీవింపచేసారు. ఇప్పుడు ఆ స్త్రీ సంతోషముతో కన్నీరు కారుస్తుంది.

మరొక రోజు, తనను వెంబడించువారు ఆకలిగా ఉండుట ఆయన చూచారు. వారు ఐదు వేలమంది కంటే ఎక్కువగా ఉన్నారు.  వారిని ఆకలితో వెనుకకు పంపడం ఆయన ఇష్టపడలేదు. ఒక చిన్న బాలుని భోజనమును ఆయన ఆశీర్వదించి అందరికి పంచారు. అక్కడ ఉన్నవారికి ఆ బోజనము పూర్తిగా సరిపోయింది. సరిపోవడమే కాకుండా ఎంతో మిగిలిపోయింది!

ఒకసారి ఆయన ఒక దోనె లో గలిలయకు సముద్రములో ప్రయాణము చేసారు. అంతట సముద్రము మీద తుఫాను వచ్చినందున ఆయన శిష్యులు భయపడిరి. ఆయన గాలికి, సముద్రమునకును ఆజ్ఞ ఇవ్వగా ఆ తుఫాను వెంటనే ఆగింది. ఇంకోసారి ఆయన నీటి మీద నడిచి ఆయన శిష్యుల వద్దకు వచ్చిరి.  ఆ సమయములో శిష్యులు దోనెలో ఉండిరి.

ఆయన మనుష్యులు చేసిన పాపములను క్షమించి వారిని స్వస్థపరిచెను. ఆనారోగ్యం నుంచి స్వస్థపడటం కంటే వారి పాపములు క్షమించబడటం అతి ముఖ్యం అని ఆయన చెప్పారు.  ఎవరైతే తమ జీవితమును మార్చమని ఆయన వద్దకు వస్తారో ఆయన వారి జీవితాన్ని మర్చివేస్తారు.

ప్రజలను మోసము చేసిన ఒక సుంకరి, వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీ, ఒక మత గురువు మరియు అనేక మంది పాపులు ఆయన వద్ద క్షమాపణ పొంది ఆయన మూలముగా ఒక క్రొత్త జీవితమును స్వీకరించారు .  ఎన్నో ఆశ్చర్యక్రియలు చేయుట ద్వారా ప్రభువైన యేసు తానే దేవుడని నిరూపించారు. ఆయన ఈ భువికి దేవుడిగా వచ్చారని నేను నమ్ముతున్నాను. నా స్నేహితులారా, మీరు నమ్ముతున్నారా?

ప్రార్ధన: “ప్రియ ప్రభు యేసు! మీరు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. నా పాపములు క్షమియించి నాకు క్రొత్త జీవితమును ఇచ్చినందుకు నేను మీకు వినయముతో ధన్యవాదములు చెల్లించుచున్నాను.”  ఆమెన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *