16 మెట్టు: యేసు క్రీస్తు – మనకొరకు లేచిన రక్షకుడు!

యేసు క్రీస్తు షిష్యులు యేసు ప్రభు దారుణంగా ష్రమకు గురై, సిలువపై మరణించటం చూసారు. షిష్యులు ఆయన లేకుండా ఒంటరిగా భయపడ్తూ ఉన్నారు.

మరణించిన మూడవ రోజు, ఆదివారము, కొంతమంది యేసు ప్రభు సమాధి దగ్గరకి వెళ్లారు, అక్కడ ఒక అద్భుతమైన ఆశ్చర్యం చుసారు! పరలోకమునుండి వచ్చిన దేవుని దూత తెరిచివున్న సమాధి దగ్గర నిలుచుండెను. ఫ్రభు దూత షిష్యులతో విజయొత్సాహంతో చెప్పారు:

“యేసు ఫ్రభు ఇక్కడ లెరు, తాను చెప్పినట్టె ఆయన లేచి ఉన్నారు!” శిష్యుల బాధ మహానందంగా మారింది!! వారి గురువు సజీవంగా ఉన్నారు!!

ఫ్రభు ఆరోజే తన ప్రియమైన శిష్యులని కలవటానికి వచ్చెను. ఆయన వారికి తన చేతులను, పాదములను చూపెను.  అది చూచి వారు వెంటనే ఎ సందేహం లేకుండ ఆయన ఒక ఆత్మ మాత్రమె కాదని! వారి గురువు సజీవంగా ఉన్నారని తెలుసుకున్నారు!

యేసు ఫ్రభు వారి కొరకు మనందరి కొరకు ఒకేసారి మరణం మరియు పాపం మీదుగా విజయం పొందారు! మన దేహములు మరణించినా, మన ఆత్మలు ఎల్లప్పటికి ప్రభు యేసు తో జీవించును! యేసు ప్రభు అన్నారు: “దేవుడు లోకమును యెంతో ప్రేమించెను, కాగ ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విష్వాసముంచు ప్రతివాడును, నషింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను.”

ఇది దేవుడు యేసు ప్రభు యందు విష్వాసముంచు వారందరికి చెప్పిన అద్బుతమైన “పునరుత్థాన” సందేషం.

ఓ మిత్రమా, నీవు యేసు ప్రభు యొక్క ఈ అద్భుతమైన వాగ్దానమును నమ్ముతున్నావా?

‘మంచి శుక్రవారము’ రోజున దేష వ్యాప్తంగా క్రైస్తవులు యేసు ప్రభు త్యాగాన్ని, సిలువపై ఆయన మరణాన్ని గుర్తు చేసికుంటారు.

రెండు రోజుల తర్వాత ‘ఈస్టెర్ ఆదివారం’ న ప్రభు పునరుత్థానాని, ఆయన తో పరలోకంలో మన శాశ్వత జీవిత వాగ్దనాన్ని మహా ఆనందంగా జరుపుకుంటారు!

ప్రార్థన: ఫ్రభువా, నేను మిమ్మల్ని ఆరాధిస్తూ, నమస్కారము చెయుచున్నాను, నా సజీవ రక్షకుడా, నా దేవా. మీరు నాకు ప్రసాదించిన పరలోక శాశ్వత జీవితానికి, వందనములు. ఆమెన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *