18 మెట్టు: పరిశుధాత్మ – మన సహయకుడు మరియు మార్గనిదర్సి

ప్రభువైన యేసు సిలువపై వెళ్లేముందు, తమ శిష్యులతో ఇలా అనెను: “సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును” యొహాను సువార్త 16:13

ప్రభువైన యేసు క్రీస్తు స్వర్గానికి వెళ్లినప్పుడు, తమ శిష్యుల యొద్దకు పరిశుధాత్మ పరలోకమునుండి దిగి వచ్చెను. యేసు లో జీవించుటకు, ఆయన గురించి అందరితో చెప్పేందుకు, పరిశుదాత్మ వారిని యెంతో జ్ఞాన, ధైర్య, సాహసాల తో నింపెను.

పరిశుధాత్మ మనకి ఎలా సహాయ పడుతుంది?

నేను నా జీవితాన్నియేసు ప్రభువుకి సమర్పించినప్పుడు, నా హ్రుదయంలో ఒక ప్రశాంతమైన, సున్నితమైన స్వరము నాతో మాట్లాడుతున్నట్లు ఉండెను – ఇదే పరిశుధాత్మ యొక్క స్వరము. నేను ఏమైన తప్పు చేస్తుంటె హెచ్చరిస్తాడు. నన్ను ఎల్లపుడు సరైన మార్గంలో, దెవుని వైపు నడిపిస్తాడు.

నా గత పాపాలను గుర్తుచేసి, నేను పశ్చాత్తాప పడుటకు (వాటిగురుంచి నేను చాల పశ్చాతాప పడుతున్నాను), మరియు ప్రతి ఒక్క దాని కొరకు దేవుని క్షమార్పణ అడుగుటకు సహాయపడతాడు. నా ప్రతి రోజుకి, పరిస్థితి కి అనుకూలంగ నాకు అవసరమైనటి ప్రత్యేకమైన పరిషుధ్ధ వాక్యాలను చూపిస్తాడు. నాకు ఎలా ప్రార్ధించాలో, దేనికొరకు వెడుకోవాలో ఆయనే నాకు చెబుతారు.

ఫరిశుధ్ధ గ్రంధంలో నుండి దేవుని వాక్యాలను తాను నాకు నెర్పించినప్పుడు, నాకవి స్పష్టంగ అర్ధమవుతాయి. నా హ్రుదయంని తెరిచి, నాకు విజ్ఞానము, వివేచనం ఇస్తాడు.నా బాధలో, అనారోగ్యంలో లేదా ఒంటరితనంలోను ఆయనే నాకు తోడుగ ఉండి సుఖమునిస్తాడు. నా బలహీనమైన పరిస్థితిలో నెను దెవుని కి మొరపెట్టుకోలేని పరిస్థితిలో, తానె నా స్థానంలో దెవునికి ప్రార్థిస్తాడు!

ఏవరితోటైన యేసు ప్రభు నా జీవితం లో చెసినవాటి గురించి, అయన గురించి మట్లాడాలంటె, పరిశుధాత్మ నాకు సాహసాన్ని ప్రసాదించి, ఎల మట్లాడాలో చూపిస్తాడు.

ఎంత అద్భుతమైన బహుమతిని ప్రసాదించారు దేవా, నా తండ్రి! మీరు మమ్మల్ని ఒంటరిగ కష్టాలతో వదలలెదు. దేవుడే, పరిశుధాత్మ మన తో ఎల్లప్పుడూ తోడుండుటకు పంపెను.

ప్రార్ధన: పరిశుధాత్మ, సదా నాలో ఉంటూ, నాకు సహాయపడుతునందుకు నీకు నా ధన్యవాదాలు. నాకు నీ మ్రుదువైన స్వరమును వినుటకు, పాఠించుటకు సహయపడుము. ఆమెన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *