25 మెట్టు: ఆలయంలో దేవుని ఆరాధించుట

ఇది ఆదివారం. ఇతర క్రైస్తవులతోపాటు నేను కూడ దేవుని ఆరాధించడానికి ఆలయానికి వెళ్తున్నాను.

నీవుకూడ నాతోపాటు రావడానికి నిర్నయించుకున్నందుకు నాకు చాలా సంతొషంగా వుంది.

క్రైస్తవులు ఆదివారమే ఆలయానికి ఎందుకు వెళ్ళ్తారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారంలో మొదటి రోజైన ఆదివరం సమాధిలో నుండి సజీవుడై లేచాడు. కాబట్టి ఈప్రపంచంలోని క్రైస్తవులందరు ఆ దేవుణ్ణి ఆరాద్దించి ప్రార్దించడానికి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి ఆలయానికి లేదా గుడికి వెళ్తారు. ఆదేవుణ్ణి భయభక్తులతో గౌరవించి ప్రార్ధించటానికి వెళ్తారు కాబట్టి ఆరోజుని ప్రభువుదినంగా ప్రత్యేకించారు.

ఆలయానికిపైన చిట్టచివర సిలువగుర్తు వుంటుంది ఎప్పుడైనా చూశారా? కొన్ని ఆలయాల్లో మనం ఆయన్ని ప్రార్ధించేచోటు కూడా సిలువ గుర్తు చూస్తాము. క్రైస్తవులకు సిలువ గుర్తు ఎంతో విలువైనది. ఎందుకంటే మనలను మన పాపాలనుండి రక్షించడానికి ఆరక్షకుడు ఆ సిలువపై ప్రాణమర్పించాడు – సిలువ అందుకు గుర్తు.

మనము లోపలికి వెళ్లి నిశ్శబ్దముగా కుర్చీ లో కూర్చుందాము. అనేకమంది క్రైస్తవులను కూడా చర్చికి రావటం చూస్తున్నాము. మనం కూడ మౌనముగా ప్రార్ధిస్తూ మన హ్రుదయాలను సిద్ద పరచుకుందాం. మంచి సంగీతం వినబడుతుంది. మనము దేవుని ఫై మన దృష్టి ఉంచినప్పుడు, మన హృదయాలు పైకి ఎత్తబడుతాయి, దేవునియొక్క సన్నిధి మనము చర్చిలో అనుభవిస్తాము.

ఆలయంలో ప్రార్ధనలు, ఆరధనలు జరిపించే (పాస్టరు) లేక మతాధికారి వచ్చాడు. ఆగుడిలో వున్న ప్రజలందరిని పరిషుద్ధాత్మ వైపు నదిపించడానికి అందరితో ప్రార్ధనలు చెయిస్తాడు. యేసుప్రభువును కృతజ్ఞత స్తుతులతో, పాటలతో, కీర్తనలతో సంతోషంగా పాడి ఆరాధిస్తాం. మతాధికారి ప్రాధించి బైబిలు (అంతె పరిశుద్దగ్రంధం) నుంది కొన్ని వాక్యాలను చదివి, వాటి యొక్క ఆర్దన్ని మాకు బోధించాడు. ఆఖరుగా ఆశీర్వచనాలతో ఆరాధన ముగిసింది.

ఆరాదన తరువాత ఇతర  క్రైస్తవులను కలుస్తాము. వారితో కలవడానికి చాలా ఆనందంగా ఉన్నాము! నీలాగ, నాలాగ అందరం దేవుని కుటుంబానికి చెందిన వారమే. వారు మన క్రైస్తవ సోదరీ సోదరులు. ప్రభువైన దేవుదు మన పరలోకపు తండ్రి – మనందరికీ తండ్రి. ఎవరికంటే ఆయన కుమారుడైన యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరిచిన వారికి.

పరిషుద్ధ గ్రంధంలో గొప్పవాడైన దావీదుమహరాజు ఏమన్నాడంటె – “యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని ” – కీర్తనలు 122-1.

ప్రార్ద్ధన: ” సర్వశక్తి గల దేవా, నిన్ను నమ్ముకున్న వారందరితో కలిసి నిన్ను ఆరాద్ధించి, ప్రార్ద్ధించడానికి ఈ ఆలయాన్ని ఇచ్చినందుకు ఎనలేని క్రుతజ్ఞతలు” ఆమెన్!

Leave a Reply

Your email address will not be published.