31 మెట్టు: నా స్నేహితుడవైన నీ కొరకే ఈ ప్రార్ధన

మనము కలసి ఇంతవరకు ప్రభువైన యేసుతో ఆరంభ అడుగులు అని 29 పాఠములను ధ్యానించాము. ప్రభువైన యేసుతో నడిచే ఈ ప్రయాణము మాకు సంతోషం కలిగించునట్లుగానే చెయ్యి పట్టుకొని నిన్ను యేసుతో నడిపించుచుండగా నీకును అధిక సంతోషకరంగా అనిపించు చున్నదని తలంచుచున్నాను. ఆయన నాకు ప్రశస్తమైన ప్రభువును, రక్షకుడును అయినట్లుగానే నీకును ప్రశస్తమైన ప్రభువును, రక్షకుడును కావలెనని నేను ప్రార్ధించుచున్నాను.

ఈ క్రింది మధురమైన గీతము మనము ప్రభువులో ఎలా నడువవలెనో తెలియజెయుచున్నది.
ఓ ఎంత అద్భుతం, ఆద్భుతమైన ఆ దినం:
ఆహా ఎంత అద్భుతం, ఎంత ఆధ్బుతమైన ఆ దినం
ఆంధకారములో నేను తిరుగాడుతున్న వేళా
నా రక్షకుడైన యేసును కలుసుకున్న ఆ దినం
ఎన్నటికీ మరువలేను ఆ దినము
ఆహా కృపా కటాక్షములు కలిగిన స్నేహితుడు
నా హృదయ అవసరతను తీర్చినవాడు
చీకటి పొరలను తొలగించినవాడు
నా చుట్టూనున్న అంధకారమును పోగొట్టినవాడు
అని ఆనదించెను.
సిలువలో రక్షకుడు నన్ను పరిశుద్దుని చేసినపుడు
నా పాపములు శుద్దీకరించినపుడు
నా రాత్రి పగటిగా మార్చబడినపుడు
పరలోకంలో నుండి పరిశుద్ధ ఆత్మ దిగివచ్చినది
మహిమతో నా ఆత్మను నింపినది.
పరలోకము దిగివచ్చి మహిమతో నా హృదయమును నింపినది.

నా ప్రియమైన స్నేహితుడా ఈ పాట ప్రభువైన యేసుతో ఆద్బుతంగా నీవు నడుచుట తెలియజెసినదని ఆశిస్తూ ప్రార్ధిస్తున్నాను. నేను నీ కొరకు ప్రార్ధించుచున్నాను. నీవు ప్రభువైన యేసులో ఉంచిన విశ్వాసము ఆయన పట్ల నీవు కలిగి ఉన్న ప్రేమ దినదినము ఎదగాలని కోరుతున్నాను. నీవు దిన దినము రక్షకుని వలె మారిపోవాలని కోరుతున్నాను!

అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున ఒంగునట్లును, ప్రతివాని నాలుకయు, తండ్రియైన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు ఫై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీయులకు 2: 9 – 11

Leave a Reply

Your email address will not be published.