1 మెట్టు: యేసు ప్రభువు నా రక్షకుడు

ఒక రోజు నేను యేసు ప్రభువుతో “యేసు ప్రభువా! మీరు నా ప్రభువని, నా రక్షకుడని అంగీకరించుచున్నాను” అని చెప్పాను. ఆయన నా జీవితమునకు ప్రభువుగా ఉండాలని కోరుకొన్నాను.  నా స్వంత దారిలో పయనించటం మానుకొన్నాను.  నేను వెనుదిరిగి యేసు ప్రభువును వెంబడించుట మొదలు పెట్టాను. యేసు ప్రభువును వెంబడించవలెనని నేనెందుకు కోరుచున్నాను?

ఎందుకంటే ఆయనను నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. కాబట్టి రక్షకుడంటే నన్ను దేనినుండైనా రక్షించే వ్యక్తి లేదా అపాయము నుండి నన్ను కాపాడే ఒక వ్యక్తి. ఒక వేళ నేను నీళ్ళలో మునిగిపోతుంటే నన్ను ఎవరైనా రక్షిస్తే ఆయన నా రక్షకుడు అవుతాడు.

యేసు ప్రభువు నన్ను నా పాపములనుండి రక్షించారు కాబట్ట్టి  ఆయన నా రక్షకుడు.

దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో ఒక్కటైనా నేను ఉల్లంఘించినప్పుడెల్లా నేను పాపము చేసినట్టే. ఇవి నరహత్య, దొంగతనము వంటి ఘోర పాపములు కావుగానీ ఇవి గర్వం, కోపం, ద్వేషం, అసూయ, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకపోవటం, తల్లిదండ్రులను ఘనపరచక పోవటం వంటి దినదినపు పాపములు.

కొద్ది కాలములోనే దేవునికి వ్యతిరేకమైన  పాపముల కొండ నాపై చేరింది. అవి ప్రతి ఒక్కటి దేవునికి తెలుసు. ఆయనకు నా హృదయము తెలుసు, నా ఆలోచనలన్నియు తెలుసు. ఈ పాపములు నన్ను పరిశుద్ధుడైన దేవుని నుండి దూరము చేస్తాయి. నేను దేవుని యొద్దకు పోలేను, నా ప్రార్ధనలు ఆయనను చేరలేవు. దేవుడు వాటి విషయము నన్ను శిక్షిస్తాడు. నేనేమి చేయాలి?

ప్రభువైన యేసు నా పాపముల శిక్ష భరించుటకు తానే పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చెను! నాకు బదులుగా ప్రభువైన యేసు సిలువ మీద మరణించెను అన్న శుభవార్తను నేను ఒక రోజు విన్నాను. ఆయన మృతులలో నుంచి సజీవునిగా లేచెనని విన్నాను! యేసు ప్రభువు చనిపోయి, సమాధి చేయబడి మూడు దినముల తరువాత సజీవునిగా తిరిగి లేచెను! మరియు ఇప్పుడు ఆయన పరలోకములో ఉన్నారు.

ఆయనే భూమ్యాకాశములకు మహోన్నతమైన పరిపాలకుడు అని విన్నాను. ! బైబిలులో ” ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు” అని అపోస్తుల కార్యం 16:31  లో చెప్పబడింది.నేను ఈ శుభవార్తను నా పూర్ణహృదయముతో నమ్ముచున్నాను. నా హృదయము ఆనందము తో నిండుచున్నది!  నా స్నేహితుడ, మీరు కూడా నమ్ముతారా?  ప్రభు యేసు మీ రక్షకుడా?

ప్రార్ధన: ప్రభువైన యేసూ, మీరే నా రక్షకుడు, నా దేవుడు.  మిమ్మల్ని ఆరాధించుచున్నాను. ఆమెన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *