15 మెట్టు: మన పాపముల నిమిత్తము సిలువపై ప్రభువైన యేసు

“యేసు క్రీస్తు” – లోక రక్షకుడు! 1 తిమోతి 1:15 లో “పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను” అని చెప్పబడినట్ట్లుగా తన సంకల్పమును నెరవేర్చే సమయము ఆసన్నమైయింది.

శిష్యులతో తను మరణించబోవుచున్నాను అని ఆయన చెప్పినప్పుడు వారు ఎంతో దుఃఖించారు. అయితే తిరిగి మూడవ దినమున లేచెదను అని ఆయన వారితో చెప్పారు. ఆయన ప్రజల పాపములను క్షమించుచున్నారని మతపెద్దలు ఆయన మీద కోపముతో ఆయనను బంధించి, దేవుడ్ని తన తండ్రి అని చెప్పుచున్నారని నేరారోపణ చేసిరి.  నరహంతకులను శిక్షించే క్రూరమైన విధముగా సిలువ వేయవలెనని నిర్ణయించారు.

ఆయన దేవుడై ఉన్నారు గనుక ఆయనను ఎవరునూ బంధించలేరు గానీ ఆయన వారిని వ్యతిరేకించలేదు ఎందుకంటే మన పాపముల నిమిత్త్తము మరణించి ప్రాయశ్చిత్తము చేయుటకు, మనలను పాపములనుండి రక్షించుటకు ఆయన ఈ భువికి వచ్చారు. ఆయనే మనకొరకై సిలువ మీద శ్రమను భరించారు. అందరికి సహాయము చేస్తూ, మంచి కార్యములను చేస్తూ ఉండి, ప్రేమయు, దయయు గలిగిన పాపము లేని దేవుని కుమారుని సిలువ మరణమునకు అప్పగించారు!

ఆయన కొట్టబడి, కించపరచబడ్డారు. తలపై ముళ్ళ కిరీటము ఆయన తలపై పెట్టబడింది. ఆ శ్రమల వలన ఆయన నీరసించి పోయారు. కొండపైకి ఆయనతో సిలువను మోయించారు. కాళ్ళకు, చేతులకు మేకులు గ్రుచ్చారు. ఆయన మౌనముగా ఈ వ్యధలన్నియు మనకొరకు భరించారు.

ప్రభువైన యేసు ఆ సిలువ మీద వేలాడుతూ, సమస్త లోక పాపములను భరించారు. మన అపరాధములను, మన వైఫల్యములను, మన అవమానములను ఆయన భరించారు.

ఆ రోజున ప్రభువైన యేసు సిలువపై మరణించారు. తమ యజమానుని శరీరము బట్టలలో చుట్టబడి, వనములోని ఒక సమాధి లో పెట్టబడటం ఆయన శిష్యులు చూచి విచారించారు.

అయితే ఆశ్చర్యకరమైన అధ్బుతం మూడవ దినమున వారి కొరకు వేచి ఉంది.

ప్రార్ధన: ప్రభువా, నా కొరకు శ్రమపడి మరణించుటకు నేనేపాటి మనిషిని? నా వంటి పాపి కొరకు మీరు చేసిన త్యాగమునకై మీ పాదముల చెంత ప్రణమిల్లి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఆమెన్!

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *