26 మెట్టు: సంఘము-భూమిపై మన క్రైస్తవ కుటుంబం

ఈ రోజు మనం మరొక సంఘానికి హాజరవుదామా? రండి వెళదాం ఒక ఇంటి వద్ద మేము ఆగాము. అది చర్చి భవనం కాదు. లోపలికి వెళ్ళి చూదాం రొండి.

లోపలి గదిలో కొన్ని కుటుంబాలు కూడుకొని ఉన్నాయి. వారు మమ్మును ప్రేమ పూర్వకంగా ఆహ్వానించారు ఆరాధనా మొదలైయింది. మా పాటలకు సహకారం అందిచుటకు అక్కడ సంగీత వాయిద్యాలు లేవు. హృదయ లోతుల్లో నుండి పాడే స్తుతి గీతాలు చాలా మధురంగా ఉన్నాయి.

ఇతర సంఘాల్లో మాదిరిగానే ఒక నాయకుడు మమ్మల్ని ప్రార్ధనలోను, వాక్య పఠనములోను నడిపించి, ప్రసంగించారు. ఆరాధన ముగించబడ్డాక సంఘములో ఉన్న సహోదరులను, సహోదరీలను కలసి సంతోష సమయాన్ని కలిగి ఉన్నాము.

సంఘము లేదా చేర్చి ఏమిటని మీకు ఆశ్చర్యం కలుగవచ్చు సంఘము అనగా ఒక భవన నిర్మాణం కాదు. ప్రభువు యేసు నామంలో ఆరాధనకు కూడా వచ్చే ప్రజలే సంఘము. విశ్వాసులందరు ఒక కుటుంబంగా కూడుకొని ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి యుండుటకు, ఒకరికొకరు ప్రార్ధన, సహాయము, ఆదరణ, సహకారము కలిగి ఉండుటకు కూడుకొనే విశ్వాసుల సమూహమే సంఘము.

అయితే లోకమంతటికి ఒకే ఒక్క సంగమున్నది అని బైబిల్ చెప్పుచున్నది. దాని భావమేమిటి?

ప్రభువైన యేసు నందు విశ్వాసముంచి ఆయనను మాత్రమే వెంబడించి, సేవించుటకు నిర్ణయించుకున్న క్రైస్తవుల విశ్వాసుల సమూహమే ఈ సార్వత్రిక సంఘము.

ప్రభువైన యేసే ఈ సంఘానికి శిరస్సు సంఘము ఆయన శరీరముగా పిలువబ్డుతున్నది. ఆయన తన జీవమును సంఘమునకు అనుగ్రహించి సంఘమును పోషించును. మనము ఆయన సొత్తు. ఆయన శరీరమైయున్న సంఘమునకు క్రీస్తే శిరస్సును, రక్షకుడునైయున్నాడు.  ఎఫెసీ 5:23

ఈ పాఠమును చదువుచున్న ప్రియ చదువుకీ, ఈ ప్రపంచంలో నీవు ఎక్కడ ఉనప్పటికీ ఏ సంసృతికీ, ఏ భాషకు నీవు చెందియునప్పటికీ, నీవు ఈ సార్వత్రిక సంఘానికి చెందినవాడివే.

నీవు క్రీస్తు నందు నా ప్రియ సహోదరుడవు, సహోదరివైయున్నావు. ఇది అద్భుతంగా లేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ కొరకు ప్రార్ధిస్తున్నాను.

నీవు, నీ కుటుంబ సమేతంగా నాతో దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు ఆరాధించడం నీకు సంతోషం కదా?

ప్రార్ధన: ప్రభువైన యేసు, నీ సార్వత్రిక, సంఘ కుటుంబంలో నన్ను కూడా ఒకే భాగం చేసుకున్నందుకు వందనములు ఆమెన్!

Leave a Reply

Your email address will not be published.