6 మెట్టు: ప్రార్ధించాలి! ఏమని ప్రార్థించాలి?

ప్రభువైన యేసు ఎలా ప్రార్దించాలో తన శిష్యులకు నేర్పారు. ఆయనను మీరు అడిగిన యెడల మీకు కూడా ఎలా ప్రార్దించాలో నేర్పిస్తారు.

నేను ఆరాధనా ప్రార్ధనను ఈలాగున ప్రార్ధిస్తాను:

“యేసు ప్రభువా! నేను మిమ్ములను ఆరాధించుచున్నాను. మీ ముందు తలవంచి ప్రార్ధిస్తున్నాను. మీరు దేవుడై, సర్వశక్తిమంతుడై యున్నారు. మీరు నా రక్షకుడై యున్నారు. మిమ్ములను స్తుతించుచున్నాను. మీకు నాపైగల అపారమైన ప్రేమకు వందనములు తెల్పుచున్నాను.”

నేను ప్రార్ధించి, ఆయనను గూర్చి, ఆయన ప్రేమను గూర్చి మరింత ఎక్కువగా తెలిసికొనుటకు సహాయము చేయమని అడుగుచున్నాను. నా పాపములన్నయు క్షమించమని ఆయనను అడుగుచున్నాను. నేను ఏవిధముగా జీవించవలేనో చూపుమని ఆయనను అడుగుచున్నాను.ఆ తరువాత, నా జీవితమంతటిని గూర్చి ఆయనతో మాట్లాడుదును. ఆయనకు నా అవసరతలు తెలిపి సహాయము అడుగుదును. అన్ని సమస్యలలో దారి చూపమని ఆయనను అడుగుదును. నా కుటుంబము కొరకు, నా స్నేహితులకొరకు ప్రార్ధించుదును. వారిపై  దేవుని ఆశిర్వాదముకొరకు,  వారి అవసరతలకొరకు  ప్రార్ధించుదును.

నా జీవితమును ఏవిధముగా ఆయన మార్చెనో వారికి చెప్పుటకు సహాయము అడుగుదును.ఆయనతో నిరంతరము మాట్లాడండి. ఆయన మీ చెంతనే యున్నారు.  మీ మనపులను ఆయన ప్రతినిత్యం ఆలకిస్తారు. ఆయనతో ఒంటరిగా సమయం గడుపుటకు కొన్నినిమిషములు (నేను కొన్ని సార్లు చేసినట్లుగా కొన్నిగంటలు) ప్రతి రోజు కేటాయించండి. ఆయనను ఆరాధించి, మీరు ఆయనను యెంత ప్రేమించుచున్నారో చెప్పండి.

తరువాత ఆయన సన్నిధిలో మౌనముగా ఉండండి – ఆయన మీతో ఉన్నారని, మీతో సమయము గడుపుటకు ఆయన యెంతో సంతోషిస్తారని  తెలుసుకొనండి. ఆయన ప్రేమయందు వి  శ్రమించండి. ఆయన ప్రేమ, ఆయన శాంతి మీ హృదయములో నిండుట మీరు కనుగొందురు.

బైబిల్ లో 1 థెస్స 5:17 లో  “యెడతెగక ప్రార్ధనచేయుడి; ప్రతి విశయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రిస్తునందు మీ విశయములో దేవుని చిత్తము”   అని వ్రాయబడినది.

ప్రార్ధన:” ప్రభువైన యేసు! మీతో సమయము గడపవలెనని కోరుచున్నాను. నా సమీపముగా వచ్చి నాకు ప్రార్ధించుట నేర్పండి”. ఆమెన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *