19 మెట్టు: స్వర్గము – మన నిత్య నీవాసము!

స్వర్గము! పరలోకము గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా నేను సంతోషంగ పాడే పాట ఒకటి గుర్తుకువస్తుంది:

“స్వర్గం ఓ అద్భుతమైన ప్రదేశం.
కీర్తి మరియు దయతో నిండినది
నా రక్షకుని ముఖము చూడాలని ఉంది.
స్వర్గం ఓ అందమైన ప్రదేశం!”

స్వర్గం దేవుని కీర్తితో నిండిఉన్నది. ఏంతో వైభవం మరియు అందంతో కూడిన ప్రదెశం! స్వర్గం ఒక అద్భుతమైన ప్రదెశం ఎందుకంటె అక్కడ దెవుడు నివసిస్తారు. యేసు ప్రభు దీనిని “నా తండ్రి నివాసము” అనెను. మనందరం, యెహూవ బిడ్డలం, స్వర్గం, తండ్రి నివాసము వద్ద ఆయనతో మరి యేసు ప్రభువుతో కలిసి ఉండటం మనం ఊహించలేని ఆనందం!

స్వర్గములో దేవదూతల సమూహము, యెహోవాను ఆరాధిస్తూ, ఆయనకు స్తొత్రము పాడుతు, పగలు రాత్రి ఆయనని సేవిస్తారు. అది ఒ ఆశ్చర్యకరమైన అద్భుత ద్రిష్యం! స్వర్గం లో ఏ బాధ లేద నొప్పి ఉండవని యెహోవా చెప్పెను! యెహోవా తనకు తానే మన కన్నీటిని తుడిచివేయును! భూమిపైన మన వేదన తర్వాత, యెహోవ స్వర్గంలో మనకు సుఖమునిచ్చెను.

యేసు ప్రభుని నమ్ముకున్న మన ప్రియమైన వారు, ఎవరైతే మనకన్నా ముందే చనిపోయున్నారో, వారందరినీ స్వర్గంలో చూడగలము. మనము మరల మన ప్రియమైన వారిని స్వర్గంలో కలవగల్తం- ఇది మన క్రైస్తవులకి ఎంతో అద్భుతమైన విష్వాసము గల్గిన విషయము!

ఫరిశుద్ధ గ్రంధంలో: “ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు” అని వ్రాయబడియున్నది.

నేను తరుచూ స్వర్గానికి వెళ్ళు దినం ఊహించుకుంటాను. యేసు ప్రభు నా చెయ్యి పట్టుకుని నన్ను యెహోవా యొద్దకు తీసుకువెళ్లెను. నన్ను యెహోవాకి అందచెస్తు, చిరునవ్వుతో అనెను: “తండ్రి, ఇదిగొ నీ బిడ్డ.” అది విని నేను సంతొషంతో యెహోవా, నా తండ్రి చాపిన చేతుల్లోకి పరిగెతాను.

నేను ఈ ప్రేమ మరియు ఆనందాన్ని నా హ్రిదయంలో అనుభవించాను. ఒక రోజు ఇది నిజమవ్తుంది! ప్రభు యేసు మాత్రమే నన్ను యెహోవ (స్వర్గములో మన తండ్రి) వద్దకు తీసుకెళ్లగలడు!

ప్రార్ధన: ప్రభువైన యెసు క్రిస్తు  పరలోకములో నీతో, నాకోసము స్థానం తయ్యారు చెసినందుకు ధన్యవాదములు. ఆమెన్!

Leave a Reply

Your email address will not be published.