30 మెట్టు: ‘సాక్ష్యము’ నేను లోకమంతటికి చెప్పాలి

దేవుడు ప్రేమ మూర్తియై – ఉన్నాడు. ఆయన ప్రేమ ఆయన కుమారుడైన ప్రభువైన యేసు రూపంలో మన యొద్దకు వచ్చింది. సంతోషకరమైన శుభవార్తను నేనులోకమంతా చెప్పాలి. మన జీవితం దేవునికి అప్పగించుట ద్వారా మరియు ప్రేభువైన యేసుక్రీస్తును వెంబడించుట ద్వారా ఎంత సంతోషం పొందగలమో దీని ద్వారా మనకు ఆర్థమవుతుంది. పాపము వలన తప్పిపోయిన నన్ను ప్రభువైన యేసుక్రీస్తు నన్ను రక్షించెను. ఆయన లేకుండా నేను రక్షింపబడుట అసాధ్యము. ఇప్పుడు నేను ప్రభువైన యేసుక్రీస్తు నందు రక్షింపబడి భద్రపరచబడి ఉన్నాను. ప్రభువైన యేసు నా హృదయంలో లేనపుడు నా హృదయమంతా పాపపు డాగులతోను చీకటితోను నుండి ఉండెను, ఇప్పుడైతే ఆయన తన పరిశుద్ధ రక్తంచేత నన్ను శుద్దీకరించి, పరిశుద్ధపరచి ఆయనయందు జీవించుచున్నాను.

ప్రభువైన యేసు నా హృదయంలో లేనపుడు నేను చీకటిలో తిరిగాను. ఇప్పుడైతే ప్రభు యేసు ధ్వారా జీవపు వెలుగులో నడుచుచున్నాను. ప్రభువైన యేసు నా హృదయంలో లేనపుడు నేను ఏ త్రోవలో నడవాలో నాకు తెలియదు, ఇప్పుడైతే నా త్రోవను ఎరిగిన నా దేవుడే నాకు మార్గదర్శియై ఉన్నాడు. ప్రభువైన యేసు నాలోలేనపుడు నేను నా పాపములలో నేను చనిపోయినవాడనై ఉన్నాను, ఇప్పుడైతే నేను నిత్యజీవము కలిగిన వాడనై ఆయనతో జివించుచూ ఉన్నాను. ప్రభువైన యేసు నాలో లేనపుడు దేవుడు నాకు కనికరము లేని తీర్పరి (జడ్జి), ఇప్పుడైతే దేవుడు నా పరలోకపు తండ్రీ.

ప్రభువైన యేసు నాలో లేనపుడు వ్యర్ధమైన వారు నాకు స్నేహితులుగా ఉన్నారు, ఇప్పుడైతే దేవుడే నాకు నిత్య సహకారియై ఉన్నాడు. ప్రభువైన యేసు నాలోలేనపుడు జీవితపు తుఫానులకు నేను భయకంపితుడై ఉన్నాను, ఇప్పుడైతే దేవుడే నాకు ఆశ్రయదుర్గము. ప్రభువైన యేసు నాలో లేనపుడు నాకు శాంతి సమాధానము లేవు, ఎప్పుడైతే యేసు నాలోనికి ప్రవేశించాడో అపుడు అన్ని పరిస్థితులలో నాకు సమాధానము కలిగెను.

ప్రభువైన యేసు నాలోలేనపుడు తాత్కాలికమైన సుఖసంతోషాలకు మురిసిపోయేవాడను, ఇపుడైతే నేను నిత్యానందము కలిగి ఉన్నాను. ప్రభువైన యేసు నా హృదయంలో లేనపుడు నేను సాతాను బంధకాలలో సాతాను ఆధీనంలో ఉండి ఉన్నాను, ఇప్పుడైతే నేను సాతాను బంధకముల నుండి విడిపించబడి స్వతంత్రుడనై ఉన్నాను.ప్రభువైన యేసు కలిగి ఉండుట ద్వారా ప్రేమగల దేవుని ఆయన అమూల్యమైన ప్రేమను మరియు ఆయన సకల ఆశీర్వాదములను కలిగి ఉన్నాను.

నేను పరలోకపు మార్గములో ఉన్నాను దేవుడు నా జీవితమునకు ఒక ప్రత్యేకమైన ఉదేశ్యమును కలిగి ఉన్నాడు. “నేను నిన్ను ప్రేమించి నీ కొరకు చేసిన సమస్త మంచి కార్యములను ప్రతి ఒక్కరికి తెలియచేయుము నేను వారిని కూడా ప్రేమిస్తున్నాననే సంగతి వారికి తెలియ చేయుము. దేవుడు ఆందరిని తన ఆశ్చర్యకరమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు. రండి ప్రభువైన యేసు వద్దకు రండి. దేవుడు మీకు ఎవ్వరూ ఇవ్వలేనియు మరియు మీరు ఎవరి యొద్ద నుండి పొందలేని ధన్యకరమైన జీవితాన్ని ప్రసాదించును.”

ప్రార్ధన: ప్రియమైన యేసుప్రభువా నీ సువార్తను గురించి నీవు నాకు అనుగ్రహించిన రక్షణను గూర్చి అనేకులకు తెలియచేయునట్లు మరియు సాక్ష్యమిచ్చునట్లు నాకు సహాయము చేయుము. ఆమెన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *